హౌసింగ్ పాలసీ తీసుకొస్తం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • మధ్య తరగతి ప్రజలకు హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ అఫర్డబుల్‌‌ హౌసింగ్‌‌ పాలసీని తీసుకొస్తున్నామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) మధ్యలో మధ్య తరగతి ప్రజల కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నామని చెప్పారు.

 శ‌‌నివారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌‌నివాస్‌‌ రెడ్డితో హిమాచ‌‌ల్ ప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మంత్రి ఎస్‌‌హెచ్‌‌ రాజేశ్‌‌ ధ‌‌ర్మాని స‌‌మావేశ‌‌మ‌‌య్యారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేప‌‌డుతున్న ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. గృహ‌‌ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌‌ర్యల‌‌ను మంత్రి వివ‌‌రించారు. 

నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు..

రాష్ట్ర పునర్‌‌‌‌ వ్యవస్థీకరణ చట్టం 2014ను అనుసరించి ఆస్తులు, అప్పులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో పేద‌‌లంద‌‌రికీ ఇందిర‌‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడ‌‌మే త‌‌మ ప్రభుత్వ క‌‌ర్తవ్యమ‌‌ని తెలిపారు. నిరుపేద‌‌ల‌‌కు శాశ్వత గృహాలు నిర్మించాల‌‌న్న సంక‌‌ల్పంతో వ‌‌చ్చే నాలుగేండ్లలో 20 ల‌‌క్షల‌‌ ఇందిర‌‌మ్మ ఇండ్లను నిర్మించడ‌‌మే ల‌‌క్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.