
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మార్చి 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది సర్కార్. టైమింగ్స్ కూడా ప్రకటించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా తెలంగాణలో వెండల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో హాఫ్ డే స్కూల్స్ ను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. అయితే, టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.