ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీపై ఫోకస్

  • స్థానిక పోలీసులతో భద్రత పెంపు
  • డాక్టర్లు, మెడికోలకు భరోసా కలిగించేలా చర్యలు
  • సీపీలు, ఎస్పీలను అప్రమత్తం చేసిన డీజీపీ ఆఫీస్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెడికల్ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి సారించింది. మెడికోలు,వైద్యుల భద్రతకు భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టించింది. జూనియర్ డాక్టర్లపై దాడులకు అవకాశం లేకుండా స్థానిక పోలీసులతో సెక్యూరిటీ పెంచాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 

రక్షణ కల్పించేందుకు విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్పిటల్స్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీల నుంచి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు.