చేనేత అభివృద్ధికి బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించాలి

చేనేత అభివృద్ధికి బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించాలి
  • తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 
  • గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు

ముషీరాబాద్, వెలుగు: చేనేత అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్​లో రూ. 2 వేల  కోట్లు  కేటాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు డిమాండ్​ చేశారు.  గురువారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత, పవర్ లుమ్ కార్మికులకు ఉపాధి లేక, సంక్షేమ పథకాలు అమలు కాక   కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేతన్నల సమస్య ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని కార్మికులకు అందరికీ ఉపాధి కల్పించాలన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మేనిఫెస్టోలో ఇచ్చిన నేతన్న హామీలను  అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం ద్వారా సరైన న్యాయం జరగకపోతే చేనేత సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్, కూరపాటి రమేష్ తదితరులు ఉన్నారు.