ప్రణీత్ రావు కేసులో ముగిసిన వాదనలు..హైకోర్టు తీర్పు రిజర్వ్

ప్రణీత్ రావు కేసులో ముగిసిన వాదనలు..హైకోర్టు తీర్పు రిజర్వ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు..  తీర్పును రిజర్వ్ చేసి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.  కస్టడీ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మార్చి 19న ప్రణీత్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించగా..ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. పోలీస్ అధికారులు మీడియా కు లీక్ లు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో 1O అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్  రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయడ కరెక్ట్ కాదు.  ప్రణీత్ రావు వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని న్యాయవాది వాదించారు. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

 

ALSO READ :- ప్రపంచంలో అత్యంత సంతోషమైన దేశం అదే భారత్ అంతా బాధాకరమే