
హైదరాబాద్, వెలుగు: ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 14 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గత నెల, ఈ నెలలో మియాపూర్ లో 5 మంది, జీడిమెట్లలో 4 , కేపీహెచ్బీలో ఒకరు, మీర్ పేట్ లో ఇద్దరు, నాగర్ కర్నూల్ అచ్చంపేటలో ఇద్దరు ఇష్టారీతినా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ 14 మందిపై ఎన్ఎంసీ చట్టం 34, 54, టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరిధి దాటి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.