సర్పంచుల పెండింగ్‌‌‌‌ బిల్లుల పాపం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌దే

సర్పంచుల పెండింగ్‌‌‌‌ బిల్లుల పాపం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌దే
  • పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల పాపం గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ దేనని తెలంగాణ పంచాయతీ రాజ్‌‌‌‌ చాంబర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. గతంలో సర్పంచ్‌‌‌‌లు చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌‌‌‌లో పెట్టి.. మళ్లీ మాజీ సర్పంచ్‌‌‌‌లతో కలిసి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు ఆందోళన చేపట్టిన తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపి నట్టుందని ఎద్దేవా చేశారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌ లక్డీకాపూల్‌‌‌‌లోని పంచాయతీ రాజ్​చాంబర్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల పాపం మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావుదేనని, ఇప్పుడు రోడ్డెక్కి బిల్లులు చెల్లించాలని ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నదని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచ్‌‌‌‌ల అధికారాలకు కత్తెర పెట్టారని మండిపడ్డారు.