![పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్స్ కల్పించాలి](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-panchayat-secretaries-demand-promotions-and-reforms_HqtewfuKj6.jpg)
- పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి
- తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంతో కాలంగా పదోన్నతులకు నోచుకోకుండా ఒకే గ్రేడ్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం డిమాండ్ చేసింది. ఎనిమిదేండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పంచాయతీ కార్యదర్శి పై రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనే పదాలను తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమస్యల సాధనకై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.
ముఖ్య అతిథులుగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్, కార్యదర్శి ముజీబ్, సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం, రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారం జగదీశ్ మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
సందిల బలరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును పరిగణిస్తూ నాలుగేళ్ల ప్రొవిజన్ కాలాన్ని రెండేండ్లకు కటాఫ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో టీఎన్జీవో నేతలు పర్వతాలు, రాజు, ఫోరం ప్రతినిధులు జి నిరంజన్, శ్రావణ్, రంజిత్, సదానందం, రఫీ తో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.