
- కేసీఆర్ 14 నెలలకు బయటకొచ్చి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నరు: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు : ఫామ్ హౌస్ నుంచి 14 నెలల తర్వాత బయటకు వచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారని కేసీఆర్ పై విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. మునిగిపోతున్న బీఆర్ఎస్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇక లేవదని చెబుతున్న కేసీఆర్.. తన పార్టీ ఇక లేవలేదని తెలుసుకోవాలన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ లేచిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేశామన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు కోసమే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడని అన్నారు. అధికారులతో పని చేయించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాదని కేసీఆర్ అనడం సమంజసం కాదన్నారు.