సుప్రీంకోర్టు తీర్పు నిరాశ పర్చింది

సుప్రీంకోర్టు తీర్పు నిరాశ పర్చింది
  • నల్గొండ ‘మీట్ ది ప్రెస్‌‌‌‌’లో మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిరాశపర్చిందని, వాస్తవాలను గ్రహించకుండానే తీర్పు ఇచ్చిందని తెలంగాణ ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లతో జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. నల్గొండ ప్రెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మీట్‌‌‌‌ ది ప్రెస్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. దేశంలో జర్నలిస్టుల వేతన వ్యవస్థ పాకిస్తాన్‌‌‌‌ కంటే దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌‌‌‌కు అక్రిడిటేషన్‌‌‌‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జర్నలిస్ట్‌‌‌‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం రూ. 10 లక్షల ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జర్నలిస్టుల్లో అనైక్యత వల్లే దాడులు జరుగుతున్నాయన్నారు. 

మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి.. పార్టీలకు అనుసంధానంగా పనిచేయడం వల్లే జర్నలిస్టులు సైతం ప్రశ్నించేతత్వాన్ని కోల్పోతున్నారన్నారు. సమావేశంలో ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌ అధ్యక్ష కార్యదర్శులు ఏరెడ్ల చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, వంగాల శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ట్రెజరర్‌‌‌‌ గుండాల యాదగిరి, ప్రెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, సలహాదారులు పుప్పాల ముట్టయ్య పాల్గొన్నారు.