తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లక్డికాపుల్ లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం.. సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దురి వెంటేశ్వర్ రెడ్డి , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజితా రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.