- గురుకులాల సెక్రటరీ
ఎర్రుపాలెం, వెలుగు: ఎర్రుపాలెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఈవారం లో ప్లాస్టిక్ బ్యాన్ కార్యక్రమంలో భాగంగా స్కళ్లలో నో ప్లాస్టిక్ అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జీరో వేస్టేజ్ క్యాంపస్ గా గురుకులాలు ఉండాలని, జీరో వేస్ట్ క్యాంపస్‌కు రూ 5 లక్షల బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ స్వరూప రాణి, ప్రిన్సిపల్ జ్యోతి, గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.