తెలంగాణ ట్రాన్స్​కోకు ఎల్‌‌‌‌డీసీ ఎక్స్‌‌‌‌లెన్స్ అవార్డు

తెలంగాణ ట్రాన్స్​కోకు ఎల్‌‌‌‌డీసీ ఎక్స్‌‌‌‌లెన్స్ అవార్డు

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కో కు జాతీయ స్థాయిలో ‘ఎల్‌‌‌‌డీసీ ఎక్స్‌‌‌‌లెన్స్ అవార్డ్​ -2024’ దక్కింది. ఈ అవార్డును నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (గ్రిడ్ ఇండియా), ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచర్స్ (ఎఫ్​ఓఎల్​డీ) ప్రకటించింది. బెస్ట్ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌డీసీ అవార్డు విజేతగా (లార్జ్ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌డీసీ కేటగిరీ) ప్రకటించింది. డిసెంబర్ 14న మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌లో జాతీయ విద్యుత్ వ్యవస్థ సదస్సు సందర్భంగా తెలంగాణ విద్యుత్ విభాగానికి అవార్డును ప్రదానం చేస్తారు. 

అవార్డు సాధించినందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ప్రజాభవన్ లో అభినందించారు. ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులు అమలు చేయడం, ఆధునిక సాంకేతికతను అనుసరించడంతో ఈ అవార్డు సాధ్యమైందని అన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలకు ఇది మరో గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ , విద్యుత్ సంస్థల టీంను అభినందించారు.