![తెలుగు టీచర్లతో ఇంగ్లీష్ మీడియం పాఠాలా!](https://static.v6velugu.com/uploads/2021/09/Telugu-medium-in-model-schools-Lessons-with-KGBV-teachers-who-teach_rSnsa6LbgQ.jpg)
- మోడల్ స్కూళ్లకు కేజీబీవీ టీచర్ల కేటాయింపుపై విమర్శలు
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల లో ఖాళీగా ఉన్న పోస్టులో కేజీబీవీ టీచర్లతో పాఠాలు చెప్పించాలని స్కూల్ ఎద్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. దీనిపై టీచర్లు, పేరెంట్స్ నుంచి విమర్శ లు వస్తున్నాయి. తెలుగు మీడియంలో చెప్పే కేజీబీవీ టీచర్లు, మోడల్ స్కూళ్లలోని స్టూడెంట్లకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు ఎలా చెప్తారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. స్టేట్ లో 194 మోడల్ స్కూళ్లలో 1,008 మంది హావర్లీ బేస్డ్ టీచర్లు హెచ్ బీటీ) పని చేసేవారు. దాదాపు 17 స్కూళ్లు పూర్తిగా హెచ్ బీటీ లతోనే కొనసాగుతున్నాయి. కానీ వారిని గతేడాది నుంచి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. ఇప్పటివరకు ఇన్లైన్, టీవీ పాఠాలు కావడంతో పెద్దగా వారి అవసరం సర్కారుకు కనిపించలేదు. కానీ ఈ నెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభం కావడంతో వారు తప్పనిసరిగా మారారు. అయితే వారిని రెన్యువల్ చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించినా, ఇప్పటికీ సర్కారు నుంచి సానుకూల ప్రకటన రాలేదని తెలుస్తోంది. దీంతో వారం కింద మోడల్ స్కూళ్లకు అల్టర్నేట్ గా సర్కారు బడుల్లోని స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను పంపించాలని డి. ఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలిచ్చా రు. టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో మరో మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. ప్రస్తుతం కేజీబీవీల్లో ఫిజికల్ క్లాసులు లేవు. దీంతో వారి సేవలను వినియోగించుకోవాలని భావించి మంగ ళవారం ఓ సర్క్యులర్ ఇచ్చారు హవర్లీ బెస్ట్ టీచర్లు ఖాళీగా ఉన్న ఇతర సబ్జెక్టు టీచర్ పోస్టుల స్థానంలో దగ్గరలోని కేజీబీవీ టీచర్లను కేటాయించాలని డీఈఓలను డైరెక్టర్ ఆదేశించారు. అయితే రాష్ట్రం లో 475 కేజీబీవీలుండగా, వాటిలో 84 మాత్రమే పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, అయితే కేజీజీపీ టీచర్లంతా తెలుగుమీడియం వారే. తెలుగు మీడియం టీచర్లు.. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లకు అర్ధమయ్యేలా ఎలా చెప్తారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నా రు. దీనివల్ల మోడల్ స్కూల్స్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. 17 నెలల పాటు ఫిజికల్ క్లాసులకు దూరంగా ఉన్న స్టూడెంట్లపై ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదని అంటున్నారు. గతంలో పనిచేసిన హవర్లీ బెస్ట్ టీచర్లను వెంటనే రెన్యువల్ చేయాలని మోడల్ స్కూల్ టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఆందోళను చేపడతామని హెచ్చరిస్తున్నాయి.