
నోయిడా : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్ జోరుకు యూపీ యోధాస్ బ్రేక్ వేసింది. గురువారం జరిగినమ్యాచ్‌లో యోధాస్ 40–34తో టైటాన్స్‌పై గెలిచింది. భవానీ రాజ్‌పుత్ (12), భరత్ (11) సత్తా చాటడంతో వరుసగా నాలుగు ఓటముల తర్వాత యూపీ మళ్లీ గెలుపు రుచి చూసింది.
టైటాన్స్ తరఫున విజయ్ మాలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ (4) గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.