
వికాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. టీచర్ వేధింపులతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓటెన్త్ విద్యార్థిని. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 24 తేదీన వికారాబాద్ జిల్లా కొత్తగాడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తు పై నుంచి దూకింది పదో తరగతి విద్యార్థిని తబిత. ఈ ఘటనలో విద్యార్థిని కాలు విరిగిపోయింది. ఎవరికి చెప్పొద్దని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించింది హాస్టల్ సిబ్బంది. ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనివ్వబోమని ఉపాధ్యాయులు భయబ్రాంతులకు గురిచేశారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు స్కూల్ బయట ఆందోళనకు దిగాయి.