ఇండియాలో త్వరలో టెస్లా సోలార్ రూఫ్‌‌‌‌టాప్‌‌లు!

ఇండియాలో త్వరలో టెస్లా సోలార్ రూఫ్‌‌‌‌టాప్‌‌లు!


   న్యూఢిల్లీ: 

టెస్లా కార్లు కంటే ముందు టెస్లా సోలార్ రూఫ్‌‌ టాప్‌‌లు ఇండియాలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియాలో సోలార్‌‌‌‌ రూఫ్‌‌టాప్‌‌లను తయారు చేయడానికి లోకల్ పార్టనర్ల కోసం టెస్లా చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పార్టనర్‌‌‌‌ సోలార్ రూఫ్‌‌టాప్‌‌ల తయారీ, ఇన్‌‌స్టలేషన్‌‌ చూసుకుంటుందని, టెస్లా టెక్నాలజీ సపోర్ట్ అందిస్తుందని, సేల్స్ విభాగంలో భాగం పంచుకుంటుందని వెల్లడించారు.  టెస్లా ప్రభుత్వంతో  చర్చలు జరుపుతోందని,  సబ్సిడీలు, గ్రాంట్‌‌లను  కోరుతోందని తెలిపారు.  ఎలక్ట్రిక్ కార్లతో పాటు సోలార్ పవర్‌‌‌‌ జనరేషన్, స్టోరేజ్ వంటి కొన్ని  హోమ్‌‌ పవర్  ప్రొడక్ట్‌‌లను కూడా టెస్లా తయారు చేస్తోంది. ఇందులో సోలార్ రూఫ్‌‌ టాప్‌‌లూ ఉన్నాయి. సాధారణంగా ఉండే రూఫ్‌‌టాప్‌‌లకు బదులు  ఫోటోవోల్టాయిక్ టైల్స్‌‌, పవర్ వాల్‌‌, బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్‌‌, సోలార్ ప్యానెల్స్‌‌తో సోలార్ రూఫ్‌‌టాప్‌‌లను ఈ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేస్తోంది. ఇండియాలో సోలార్ రూఫ్‌‌టాప్‌‌ల తయారీ ప్లాంట్ పెట్టడంపై టెస్లా స్పందించలేదు.  యూఎస్‌‌లో సోలార్ బిజినెస్ స్లో అయ్యింది. దీంతో ఇతర మార్కెట్లలో అవకాశాల కోసం కంపెనీ చూస్తోంది.  డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో  యూఎస్ సోలార్ బిజినెస్‌‌ 59 శాతం తగ్గింది(ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌).  మరోవైపు సోలార్ రూఫ్‌‌టాప్ సెక్టార్‌‌‌‌లో ఇండియా ఇన్సెంటివ్స్‌‌ ప్రకటించింది. టాటా పవర్‌‌‌‌, అదానీ సోలార్‌‌‌‌,  సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్‌‌, వారీ ఎనర్జీస్‌‌ వంటి ఇండియన్  కంపెనీలు ఈ సెక్టార్‌‌‌‌లో ఉన్నాయి. టెస్లా 2.6 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ సిటీని కొనుగోలు చేయడం ద్వారా  2016 లో  సోలార్ రూఫ్‌‌టాప్ బిజినెస్‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఫుల్ స్పీడ్‌‌లో..

ఇండియాలో సోలార్ రూఫ్‌‌టాప్  సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. కెపాసిటీ  గత  ఐదేళ్లలో ఏడాదికి 47 శాతం గ్రోత్ రేట్‌‌ నమోదు చేస్తోందని  ఎనలిస్టులు పేర్కొన్నారు. కిందటేడాది డిసెంబర్ నాటికి  దేశంలో ఇన్‌‌స్టాల్ అయిన  రూఫ్‌‌టాప్‌‌ సోలార్ కెపాసిటీ 11.1 గిగా వాట్లని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ గిరీష్‌‌కుమార్ కడం పేర్కొన్నారు. ఇందులో బల్క్ కెపాసిటీ కమర్షియల్‌‌, ఇండస్ట్రియల్ యూజర్ల నుంచి ఉందని చెప్పారు. రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌ కూడా నిలకడగా పెరుగుతోందని, 2.7 గిగావాట్లకు చేరుకుందని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్‌‌ (2022 నాటికి) 40 గిగావాట్లను చేరుకోలేకపోయిందని అన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన స్కీమ్‌‌తో సోలార్ రూఫ్‌‌టాప్‌‌లకు భారీగా డిమాండ్ క్రియేట్ అవుతుందని గిరీష్‌‌కుమార్‌‌‌‌ పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద దేశంలోని కోటి ఇండ్లకు సోలార్ రూఫ్‌‌టాప్‌‌లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేవలం ఇండియాలోనే తయారైన సోలార్ మాడ్యూల్స్‌‌ను ఇందుకోసం వాడడానికి అనుమతి ఇచ్చింది.  దీంతో డొమెస్టిక్ సోలార్ మాడ్యుల్‌‌ మార్కెట్‌‌లో 20–25 గిగావాట్ల డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనా.

Also read : 2023 Cyber Attacks: వెబ్సైట్లు,యాప్లపై 5.14 బిలియన్ల సైబర్ దాడులు జరిగాయ్..