ఎప్​సెట్​కు 48,158 దరఖాస్తులు

ఎప్​సెట్​కు 48,158 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్​సెట్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకూ 48,158 మంది అప్లై చేసుకున్నట్టు ఎప్​సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తెలిపారు. దీంట్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు 31,805 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు 16,317 మంది, రెండింటికీ 36 మంది అప్లై చేసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 1 నుంచి ఎప్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.