
గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులకు TGPSC గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఫలితాలపై TGPSC కీలక ప్రకటన చేసింది.గ్రూప్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. మార్చి 10 నుంచి 18వ తేదీ మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
- మార్చి 10 : గ్రూప్ 1 ప్రొవిజినల్ మార్కుల జాబితా వెల్లడి
- మార్చి 11 : గ్రూప్ 2 ర్యాంకుల ప్రకటన
- మార్చి 14 : గ్రూప్ 3 ర్యాంకుల ప్రకటన
- మార్చి 17 : 9 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు
- మార్చి 19 :ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ మెంట్
ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెపితే 99667 00339 నెంబర్‌కు ఫోన్ చేయాలని టీజీపీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 ఖాళీల భర్తీ కోసం 2024 డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష జరిగింది. ఇక 1,365 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 3 పరీక్షలు గతేడాది నవంబర్ 17,18న జరిగాయి. మొత్తం 3 పేపర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. గ్రూప్స్ పరీక్షలు ముగియడంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల ఫలితాల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇక గ్రూప్ 1 కు సంబంధించి 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం చూసుకుంటే ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు.
అయితే మార్చి 6 వతేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంకా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం జరిగింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్స్ జారీ చేసి త్వరగా నిరుద్యోగులకు ఊరట కలిగించేందుకు జాబ్నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.