హైదరాబాద్, వెలుగు: కరోనాతో దెబ్బతిన్న రియల్టీ సెక్టార్ బలంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ మార్కెట్లో అమ్మకాలు కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. ఆఫీసు స్పేసుకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ప్రాపర్టీ రీసెర్చ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ తాజా స్టడీ ద్వారా ఈ విషయం వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. 2021 మూడో క్వార్టర్లో 64,010 యూనిట్లను రియల్టర్లు డెలివరీ చేశారు. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రెసిడెన్షియల్ అమ్మకాలు 92 శాతం గ్రోత్‌ని సాధించాయి. ముఖ్యంగా హైదరాబాద్, కోల్‌కతాలలో అమ్మకాలతోపాటు కొత్త ప్రాజెక్టులు కూడా కొవిడ్ ముందు స్థాయికి చేరాయి. థర్డ్ వేవ్ ముప్పు ఉన్నప్పటికీ, ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ 2021 మూడవ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా బలమైన గ్రోత్‌ని సాధించాయి. మెట్రో సిటీల్లో మొత్తం మూడవ క్వార్టర్లో 12.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అమ్ముడయింది. ఏడాది లెక్కన 168 శాతం గ్రోత్ కనిపించింది.
ఇంపార్టెంట్ పాయింట్స్...
పశ్చిమ బెంగాల్‌లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వల్ల కోల్‌కతాలో అమ్మకాలు గత సంవత్సరం క్యూ3 కంటే తాజా క్యూ3లో 75 శాతం పెరిగి 6,861 యూనిట్లకు చేరాయి. ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన గ్రోత్ వల్ల బెంగళూరు కూడా బలంగా పుంజుకుంది. స్టాంప్ డ్యూటీ మినహాయింపును రద్దు చేసినప్పటికీ 2021 రెండవ క్వార్టర్లో ముంబై, పూణే మార్కెట్లు అమ్మకాల జోరును కొనసాగించాయి. స్పాట్ డిస్కౌంట్లు, ఫైనాన్సింగ్ డీల్స్ కూడా అమ్మకాలను పెంచాయి. కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల లాంచ్‌లు ఏడాది ప్రాతిపదికన క్యూ3 లో 90 శాతం పెరిగి 58,967 యూనిట్లకు ఎగిశాయి. మునుపటి క్వార్టర్లో 27,453 రెసిడెన్షియల్ యూనిట్లు లాంచ్ కాగా, 27,232 రెసిడెన్షియల్ యూనిట్ల అమ్ముడయ్యాయి. మార్కెట్లలో వెయిటెడ్ యావరేజ్ ప్రైసెస్ 2021 మూడవ క్వార్టర్లో నిలకడగా ఉన్నాయి మునుపటి క్వార్టర్‌తో పోలిస్తే తగ్గలేదు. ఈ క్వార్టర్లో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా మార్కెట్లలో ఏడాది ప్రాతిపదికన ధరలు కొద్దిగా పెరిగాయి. రూ. 5-0 లక్షల నుంచి రూ.కోటి టికెట్ సైజులో అమ్మకాల వాటా ఒక సంవత్సరం క్రితం 32 శాతం ఉండగా, 2021 మూడో క్వార్టర్లో 35 శాతానికి చేరింది. అయితే రూ. 50 లక్షల టికెట్ సైజు కేటగిరీలో రెసిడెన్షియల్ అమ్మకాల వాటా క్యూ 3లో 45 శాతం నుండి 43 శాతానికి తగ్గిపోయింది. క్యూ3లో ఎనిమిది సిటీల్లోనూ కార్యాలయ లావాదేవీలు మెరుగుపడ్డాయి 2019 క్వార్టర్ అమ్మకాల్లో 83 శాతం వరకు మెట్రోల్లోనే జరిగాయి.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఐటీ సెక్టార్ కంపెనీలు ఆఫీసు స్పేస్‌ను ఎక్కువగా కొన్నాయి.
హైదరాబాద్ మార్కెట్ అద్భుతం : జేఎల్‌ఎల్
కరోనా ఎఫెక్ట్‌ను సమర్థంగా ఎదుర్కొన్న రియల్టీ మార్కెట్లలో హైదరాబాద్ ముందంజలో ఉందని మరో ప్రాపర్టీ కన్సల్టింగ్ ఫర్మ్ జేఎల్‌ఎల్ రిపోర్టు ప్రకటించింది. దీని ప్రకారం, ఏడు మెట్రో నగరాల్లో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జనవరి–-సెప్టెంబర్ 2021 లో ఇండ్ల అమ్మకాలు 47 శాతం పెరిగాయి. సెకండ్‌వేవ్ వల్ల 2021 మొదటి మూడు క్వార్టర్లో అమ్మకాలపై తీవ్ర ఎఫెక్ట్ కనిపించింది. 2021 క్యూ3లో అమ్మకాలు 65 శాతం మెరుగుపడ్డాయి. 32,300 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇవి గత క్యూ1తో పోలిస్తే 18 శాతం ఎక్కువ. ప్రాజెక్టుల లాంచ్‌లలో హైదరాబాద్ ఏకంగా 28 శాతం వాటాను సాధించింది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్లలో కొత్త లాంచ్‌లు ఎక్కువగా అఫోర్డబుల్, మిడ్ సెగ్మెంట్లలో ఉన్నాయి. ‘‘రాబోయే పండుగ సీజన్ కోసం రియల్టర్లు భారీగా కొత్త ప్రాజెక్ట్ లాంచ్‌లకు రెడీ అవుతున్నారు. కొనుగోళ్లు కూడా బాగానే ఉండొచ్చు. క్యూ3లో సేల్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్, కోల్‌కతా మార్కెట్లు కరోనా ఎఫెక్ట్ నుంచి వేగంగా కోలుకున్నాయి. డిస్కౌంట్లు, తక్కువ వడ్డీరేట్లు, పొదుపు బాగా పెరగడం వల్ల అమ్మకాలు బాగున్నాయి’’
‑ శిశిర్ బైజాల్, ఎండీ నైట్‌ఫ్రాంక్ ఇండియా