చలో లాస్ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అట్టహాసంగా పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

చలో లాస్ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అట్టహాసంగా పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

పారిస్‌‌‌‌‌‌‌‌ : ఉత్కంఠ పోరాటాలు, ఉద్విగ్న క్షణాలతో క్రీడా ప్రపంచానికి రెండు వారాలకు పైగా  వినోదాన్ని పంచిన  పారిస్‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ అంతే  ఉత్కంఠగా ముగిశాయి. పారిస్‌‌‌‌‌‌‌‌లోని  ప్రతిష్టాత్మక స్టేడ్​ డి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో 75 వేల మంది ప్రేక్షకుల ముంగిట ఇండియా టైమ్ ప్రకారం  ఆదివారం అర్ధరాత్రి జరిగిన  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ ముగింపు వేడుకలు అలరించాయి. సీన్‌‌‌‌‌‌‌‌ నదిపై దాదాపు నాలుగు గంటల పాటు వినూత్నంగా సాగిన ప్రారంభ వేడుకలు ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ గొప్ప వారసత్వాన్ని  ప్రపంచానికి చాటి చెప్పగా..  ముంగిపు ఉత్సవాలూ అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా అలరించాయి.

ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టిక్ డైరెక్టర్ థామస్ జాలీ రూపొందించిన రెండు గంటల షో ఆకట్టుకుంది. ఆతిథ్య నగరం గురించి చెప్పే పాటతో ఈ వేడుక మొదలైంది.  తర్వాత  మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న అన్ని దేశాల జట్లు తమ జెండాలతో స్టేడియంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇండియా ఫ్లాగ్ బేరర్లు  షూటర్ మను భాకర్, హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్  జాతీయ జెండాతో మన బృందాన్ని ముందుండి నడిపించారు. అనంతరం వైవిధ్యమైన, కలర్ ఫుల్‌‌‌‌‌‌‌‌ షోలు అలరించాయి. ముసుగు ధరించిన డ్యాన్సర్లు, అక్రోబాట్ ఆర్టిస్టులు తమ విన్యాసాలతో ఔరా అనిపించారు. వీరిలో కొందరు స్టేడియంపై కప్పు నుంచి ఒలింపిక్ రింగ్‌‌‌‌‌‌‌‌లపైకి దూకారు. స్విస్‌‌‌‌‌‌‌‌ మ్యూజిషీయన్‌‌‌‌‌‌‌‌  అలైన్ రోచె  గాల్లో తేలియాడుతూ పియానో వాయించడం ఆక్టటుకుంది.

‘రికార్డ్స్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో  బిల్లీ ఎలిష్, స్నూప్ డాగ్, రెడ్ హాట్ చిలీ పెప్పర్స్ , హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ  వంటి అమెరికా సంగీత ప్రముఖులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టి పడేశారు. తర్వాతి ఎడిషన్‌‌‌‌‌‌‌‌ అమెరికాలోని లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నేపథ్యంలో పారిస్ ఆర్గనైజర్లు ఆస్కార్, గ్రామీ- అవార్డు విజేత విజేత  హెచ్‌‌‌‌‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా అమెరికా ఆర్టిస్టులకు పెద్ద పీట వేశారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికా జాతీయ గీతం అలపించారు.

 టామ్ క్రూజ్‌‌‌‌ ఫినిషింగ్ టచ్‌‌  

స్టేడియంలో సైన్స్-ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ ప్రేరేపిత లేజర్, లైట్‌‌‌‌‌‌‌‌ షోలు కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా సాగాయి.  ముగింపు వేడుకల్లో భాగంగా ఒలింపిక్  జ్యోతిని లాంఛన ప్రాయంగా అర్పివేశారు.  ఒలింపిక్ గీతం పాడిన తర్వాత ఒలింపిక్ జెండాను పారిస్ మేయర్ అనె హిడాల్గో.. ఐవోసీ ప్రెసిడెంట్ థామస్‌‌‌‌‌‌‌‌ బాచ్‌‌‌‌‌‌‌‌కు అందించారు. వచ్చే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజెల్స్‌‌‌‌‌‌‌‌లో జరగనున్న నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నట్టుగా.. థామస్‌‌‌‌‌‌‌‌  బాచ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ జెండాను అధికారికంగా లాస్ ఏంజిల్స్ మేయర్ కారెన్ బాస్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు.

కారెన్‌‌‌‌‌‌‌‌.. జెండాను అమెరికా టాప్ జిమ్నాస్ట్‌‌‌‌‌‌‌‌ సిమోన్ బైల్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో పెట్టింది. చివర్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్‌‌‌‌‌‌‌‌’ థీమ్ సాంగ్‌‌‌‌‌‌‌‌తో  స్టేడియం పైకప్పు నుంచి స్టంట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. కిందికి దిగాడు. ప్రేక్షకులకు అభివాదం చేసిన తర్వాత స్టేజ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఐదు ఖండాల టాప్ అథ్లెట్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.   బైల్స్ నుంచి ఒలింపిక్ జెండాను తీసుకున్న టామ్‌‌‌‌‌‌‌‌.. దాన్ని తన బైక్‌‌‌‌‌‌‌‌ వెనకాల కట్టుకొని వెళ్లిపోయాడు. వేడుకలు ముగిసిన తర్వాత గోల్డెన్ కలర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్స్క్‌‌‌‌‌‌‌‌తో స్టేడియం మొత్తం జిగేల్‌‌మన్నది.