మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వందే మెట్రో రైలు పూర్తి అన్ రిజర్వడ్ ఎయిర్ కండిషన్తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది ప్రయాణికులు నిల్చుని ప్రయాణించవచ్చు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్లోని అహ్మదాబాద్ – భుజ్ల మధ్య గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో 334 కిలో మీటర్ల మేరకు మెట్రో రైలు ప్రయాణించింది.
వందే భారత్ మెట్రో రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అహ్మదాబాద్, భుజ్ మధ్య 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోనున్నది.
వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతోపాటు సెమీ హైస్పీడ్ రైలుగా దీన్ని రూపొందించారు. మెట్రో రైలులా ఆటోమేటిక్ డోర్లు దీనిలో ఉంటాయి.