Akshay Kumar Sarfira: ‘టికెట్' కొంటే ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం..మా సినిమాకు రండి’..ఆడియెన్స్‌కు మల్టీప్లెక్స్‌ల ఆఫర్

అక్షయ్ కుమార్ (Akshay Kumar)..ఈ పేరు వింటే బాలీవుడ్ లో అత్యంత ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ కలిగిన హీరో పేరని అందరికీ తెల్సిందే.అంతేకాదండోయ్  బాలీవుడ్ లో అత్యధికంగా ఆదాయం ప‌న్ను చెల్లిస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒక‌రు. అయితే, లేటెస్ట్గా అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన 'స‌ర్పిరా' (Sarfia)మూవీ ఇటీవ‌ల జూలై 12న రిలీజ్ అయింది.ఇక ఈ సినిమాతో ప్లాప్ హీరోగా కూడా వినిపిస్తున్నాడు.వివరాల్లోకి వెళితే..

ALSO READ | KA Teaser Review: 'క' టీజర్ వచ్చేసింది..మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు..కిరణ్కి హిట్ పక్కా!

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.తెలుగు,తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఆకాశం నీ హద్దు రా మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడట్లేదు.అయితే,ఇందుకు అక్ష‌య్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కార‌ణ‌మో! కంటెంట్ న‌చ్చ‌లేదో గానీ నార్త్ ఆడియ‌న్స్ కి మాత్రం ఈ మూవీ ఈ మాత్రం రుచించ‌లేదు.

ALSO READ | The Goat Life OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్-మారిన ప్లాట్‌ఫామ్-స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అంతేకాదు అక్ష‌య్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ కూడా పెద్ద‌గా రాలేదు.ఇక 'స‌ర్పిరా'మూవీకి థియేట‌ర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అసలు ఆసక్తి చూపకపోవడంపై..దీంతో ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్‌లు ఉచితంగా టీ, సమోసాలు అందించాలని డిసైడ్ అయ్యాయి.దీంతో లాభం లేద‌నుకున్న థియేట‌ర్ యాజ‌మాన్యం ఎక్కువ మంది ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ డెస్పరేట్ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. టికెట్ తో పాటు కాంప్లిమెంట‌రీగా రెండు స‌మోసాలు,ఒక టీ అందిస్తుంది.

ALSO READ | Indian 2 Box Office Collection Day 3: పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్లు..వీకెండ్ అయినా థియేటర్లకు రాని జనం!

అయితే సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న అగ్ర కథానాయకుడి సినిమాకి ఫస్ట్ డే ఎంత లేదన్నా మోస్తరు రేంజ్ వసూళ్లు వస్తాయి. కానీ ‘సర్ఫిరా’ సినిమా వసూళ్లు మాత్రం భారీగా పడిపోయాయి.ఫస్ట్ డే (జూలై 12న) కేవలం రూ.2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సెకండ్ డే రూ.4.50 కోట్లు రాబట్టింది. ఇక చేసేదేమి లేక ఆదివారం (జూలై 14)సినిమా కలెక్షన్లను మరింత పెంచాలనే లక్ష్యంతో ఈ ప్లాన్ చేసింది. 

అందుకోసం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు టీ, సమోసాలను ఆఫర్ చేసింది.ఈ విషయాన్ని ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సర్ఫిరా సినిమా చూసేందుకు వచ్చే వారికి 2 సమోసాలు,1టీ, 1లగేజీ ట్యాగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు అందులో ప్రకటించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.