వీడు మనిషేనా?..ఆడ పిల్ల పుడుతుందని.. గర్భిణిని ఇంటి నుంచి గెంటేశాడు భర్త

వీడు మనిషేనా?..ఆడ పిల్ల పుడుతుందని.. గర్భిణిని ఇంటి నుంచి గెంటేశాడు భర్త

ఆడపిల్ల పుట్టబోతుందని ఓ నీచుడు గర్భిణి అని చూడకుండా తన భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఓ భర్త.  రంగారెడ్డి జిల్లా  అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. 

అక్భర్ ఖాన్ తో హుమేరా బేగం అనే మహిళకు వివాహం అయింది.  ఇప్పటికే  వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.  ప్రస్తుతం హుమేరా బేగం మళ్లీ గర్భావతి. అయితే  మూడోసారి కూడా ఆడ పిల్ల పుడుతుందని అర్థరాత్రి  ఇద్దరు పిల్లలతో పాటు భార్యను  పుట్టింటికి  గెంటేశాడు భర్త అక్బర్ ఖాన్.   వివాహ సమయంలో పెట్టిన సామాన్లు సైతం అత్తారింటికి పంపించాడు. ఇద్దరు  పిల్లతో రోడ్డున పడ్డ బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  

అత్తామామ కూడా కొడుకుకు వత్తాసు పలకడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది హుమేరా బేగం.   వివాహం జరిగినప్పటి నుంచి  భర్త వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది.  మొదటి సారి ఆడపిల్లకు జన్మ నిచ్చిన తరువాత అదనపు కట్నం తేవాలని చిత్ర హింసలు పెట్టాడని తెలిపింది.  గర్భవతి అయిన‌ రెండు సార్లు   భర్త అక్బర్ ఖాన్  తనను పుట్టింటికి పంపించాడని తెలిపింది. భర్త అక్బర్ ఖాన్ పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు హుమేరా బేగం.