- 11 తులాల బంగారం, రూ.3 లక్షల చోరీ
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో శుక్రవారం అర్ధరాత్రి మూడిండ్లలో దొంగలు చొరబడి 11 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. 21 వ వార్డులో క్లాసిక్ ఫంక్షన్ హాల్ మేనేజర్ నయీమొద్దీన్ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.2 లక్షలు
10 తులాల బంగారం దోచుకున్నారు. 22వ వార్డులో షబానా బేగం ఇంట్లో చొరబడి రూ.లక్ష నగదు, తులం బంగారం చోరీ చేశారు. సమీపంలోనే ఉన్న చిలక గంగుబాయి ఇంటి తాళం పగల గొట్టారు. స్థానికులు మేల్కొని కేకలు వేయడంతో చేతికందిన వస్తువులతో ఉడాయించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.