- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నాగ్‌పూర్: జనాభా నియంత్రణపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జనాభా నియంత్రంణకు ఒక విధానం ఉండాలని, రాబోయే 50 సంవత్సరాలకు ఈ విధానాన్ని రూపొందించి దానిని సమానంగా అమలు చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం, విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ తో పాటు గోల్వాల్కర్ కు నివాళులర్పించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆ తర్వాత ఆయధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వార్షిక నివేదికను ఆయన సమర్పించారు.
ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ జనాభా అసమతుల్యత దేశానికి సమస్యగా మారిందని అన్నారు.స్వాధీనత నుంచి స్వతంత్రత వరకు ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం మరింత పురోగతి సాధించడానికి, గౌరవనీయమైన స్థానానికి ఎదగడానికి హాని కలిగించే అంశాలు ప్రపంచంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని కోరారు. తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లో భయోత్పాతం సృష్టించడానికి హింసాకాండను ఆశ్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దేశ విభజన విచారకరమైన చరిత్ర అని చెప్పారు. దేశ సమగ్రత, ఐక్యతను తిరిగి తీసుకురావడానికి కొత్త తరం కృషి చేయాలన్నారు మోహన్ భగవత్.