డోర్నకల్ కు గ్రహాంతర వాసులు వచ్చారంట.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

డోర్నకల్ కు గ్రహాంతర వాసులు వచ్చారంట.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ఈ సోషల్ మీడియా ఉందే.. ఏది నిజమో.. ఏది అబద్ధమో అన్న సంగతి పట్టించుకోదే.. విజువల్స్ ఏంటీ.. వాటిలోని నిజం ఏంటీ అనే విషయంతో సంబంధం లేకుండా రచ్చ రచ్చ చేస్తుంది.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు గ్రహాంతర వాసులు వచ్చారంటూ సీసీ కెమెరా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావటం.. ఊరూ వాడా చర్చించుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో   ఆగస్టు 23న అర్థరాత్రి ఒంటిగంట సమయంలో  తేలికపాటి వర్షం పడుతోంది. ఈ  సమయంలో  తెల్లటి షాడో ఒకటి  పైనుంచి కిందకు వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఒకే ప్రాంతంలో ఒక ఆకారం ఏర్పడింది. అది ఏంటనేది స్పష్టంగా కనిపించడం లేదు. అదే సమయంలో ఒక మనిషి కూడా  నడుచుకుంటూ అటు వైపు గా వెళ్లాడు.   తెల్లటి ఆకారం  సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో గ్రహాంతర వాసులంటూ ఊరంతా చర్చించుకుంటున్నారు. వీడియోను  సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.   

అయితే వర్షం కారణంగా అక్కడ  స్థంభంపై ఉన్న వీధి లైట్ పై నీళ్లు పడడంతో వింత ఆకారం  ఏర్పడిందని చెబుతున్నారు గ్రామస్థులు.