వరంగల్: వరంగల్ లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాలుగైదు రోజుల కిందట ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్ తీవ్ర పదజాలంతో దుషిం చారు. వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని 4 వేల కోట్లతో డెవలప్ మెంట్ చేశానని చెప్పుకొచ్చారు. దీంతో దమ్ముంటే రాజీనామా చేసి అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 10 వరకు నరేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రదీప్ డిమాండ్ చేశారు.
దీంతో వరంగల్ తూర్పు లో రాజకీయ దుమారం రేపుతోంది. ఇక వీటిపై ఎమ్మెల్యే నరేందర్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇకపోతే ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ప్రదీప్ రావు... ఈ నెల 21న మునుగోడు జరగనున్న బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.