కాంగ్రెస్ పార్టీలో చేరబతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పై హైదరబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు బాబా ఫసియుద్ధిన్ యాదృచ్ఛికంగా అక్కడే ఉన్నారని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో బాబా ఫసియిద్ధిన్ చేసిన పోస్టులకు తనకు సంబంధం లేదని మోతే శ్రీలత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన్ను కలిశానని తెలిపారు. మంగళవారం నల్లగొండలో జరిగిన సభకు వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని అన్నారు. తన సోదరి కూతురు వివాహానికి వెల్లినందునే కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కాలేదని మోతే చెప్పారు.
Also Read: తెలంగాణలో మండనున్న ఎండలు.. 6 రోజులు వేడిగాలులు