Viral: ఇది వెడ్డింగ్​ కార్డా.. . ఎగ్జామ్​ పేపరా..!

పెళ్లి అంటే  ఆ సంబరమే వేరు.. ఎంగేజ్​ మెంట్​ తరువాత...వెడ్డింగ్​ కార్డు ప్రింట్​ చేయించడంతో పెళ్లి పనులు మొదలవుతాయి.  ఇప్పుడు జనాలు ఎంత గ్రాండ్​గా వెడ్డింగ్​ కార్డ్​ తయారు చేస్తే... అంత రిచ్​ గా ఫీలవుతున్నారు.   కాని ఓ టీచర్​ తన బుద్దిని పోనిచ్చుకోలేదు.. తన పెళ్లి శుభలేక అచ్చం ఎగ్జామ్​ పేపర్​ తరహాలో ప్రింట్​ చేయించి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో అది కాస్త వైరల్​ అయింది.

అసలే సోషల్​ మీడియా యుగం.. వరుడు.. వధువు.. బంధువులు.. స్నేహితులకు ఈ వెడ్డింగ్​ కార్డ్ పోస్టులో వారికి చేరడం లేటైనా... సోషల్​ మీడియాలో ఫాలో అయితే చాలు.. వారి వెడ్డింగ్​ కార్డు చూడవచ్చు. ఇంతకూ అ పెళ్లి శుభలేఖ ఎలా ఉందంటే...

యూనిట్​ I.. యూనిట్​ .II పరిక్షల మాదిరిగా

 నార్కెడమిల్లి వారి వివాహ ఆహ్వాన పత్రిక అని పైన అచ్చు వేయించి.. పక్కన 100/100 అని రౌండ్​ చేశారు.

  I.   వరుడు ఫోటో వేసి.. ఈ వ్యక్తి ఎవరో గుర్తించండి
జవాబు:  వరుడు ఫణీంధ్ర
II.  వధువు పేరులోని స్పలింగ్​ ను కరక్ట్​ చేయండి.. PRATUSHA
జవాబు: PRATHYUSHA
III.   వరుడి తల్లి దండ్రుల పేర్లు __________ (   Fill in the Blanks మాదిరిగా)
       డా. చిదల  శ్రీరామమూర్తి... జానకీదేవి
IV. కన్యాదానం ఎవరు చేస్తారు ( ప్రశ్న జవాబు మాదిరిగా)
   జవాబు:  నార్కెడమిల్లి  సతీష్​... రాణి
V  పెళ్లి జరుగు శుభ తేది ( MULTIBLE Choice)         (C)
     a.  25---–8–24    b.  18–11–24        c.  23–8–24        d.  09–07–24
 
VI.  వివాహ సమయం                                                 (B)
  a.  12.30pm       b.  2:45am               c.  8:58am        d.  7.00pm

VII   వివాహము ఎక్కడ జరుగుతుంది?  ( ప్రశ్న జవాబు మాదిరిగా)
జవాబు:  శ్రీ వేణుగోపాల ఆడిటోరియం, మార్టేరు, పశ్చిమగోదావరి

VIII .. తప్పో.. రైటో చెప్పండి ( True or False)
        1.    విందు ప్రారంభ సమయం 7.00pm  (T)
          2.  అందరూ ఆహ్వానితులా       (T)
        3.  బహుమతులు స్వీకరించబడవు  (T)

ఇలాసింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ఇంగ్లీషులో  ప్రత్యూష తయారు చేయించారు. 

మరి పెళ్లి శుభలేఖను ఇలా వెరైటీగా తయారు చేయించి అందరినీ ఆకట్టుకున్నారు. . పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష... ఇక పెళ్లి ఎంత వెరైటీగా ప్లాన్​ చేశారో ... మరి...