దేశంలోనే మొదటి సోలార్ బోటును (ఫెర్రీ బోట్–ప్యాసెంజర్లు, కొన్ని సార్లు వెహికల్స్‌ను నదులు దాటించే బోటును) నవల్ట్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్ తీసుకొచ్చింది. ఆదిత్య పేరుతో పిలుస్తున్న ఈ బోట్‌లో ఒకేసారి 75 మంది కూర్చోవచ్చు. ఎండగా ఉన్న రోజు సోలార్ కరెంట్‌తో 6 గంటల వరకు ఈ బోట్ కదులుతుంది. కేరళ స్టేట్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కోసం దీనిని తయారు చేశారు. ఈ బోట్ ధర రూ. 1.95 కోట్లు (2013 టెండర్ రేటు). డీజిల్ వెర్షన్ కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేయాలి. ఆదిత్య ఫెర్రీతో 2.8 కి.మీ దూరానికి కేవలం రూ. 4 మాత్రమే ఖర్చ అవుతుంది.