7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్

7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్
  • ముగ్గురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: మినీ లారీలో నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కర్నూలుకు చెందిన ఆలూరు మాదన్న కర్నాటక గజేంద్ర గాడలోని జిన్నింగ్​ మిల్లు నుంచి కాటన్​విత్తనాలను సేకరిస్తున్నాడు. వాటికి రంగులు కలిపి, రైతులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు కర్నాటకు చెందిన వాహనంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మల్లంపేట​వద్ద పోలీసులు తనిఖీ చేశారు. 

నిందితులను నుంచి రూ.17.50 లక్షల విలువైన 700 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదన్నతోపాటు లారీ డ్రైవర్​ఆదర్శ్, క్లీనర్ గొల్ల ఉదయ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు. మాదన్నపై గతంలో సైతం నకిలీ విత్తనాల కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   ​