గంజాయి విక్రయాలు.. బైక్ దొంగతనాలు

గంజాయి విక్రయాలు..  బైక్ దొంగతనాలు
  • ముగ్గురు అరెస్టు...  రూ.35 వేలు,  1.600 కిలోల గంజాయి స్వాధీనం 

నల్గొండ అర్బన్, వెలుగు  :  జల్సాలకు అలవాటు పడి,   గంజాయి విక్రయిస్తూ,   దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను బుధవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ  శివరాంరెడ్డి తెలిపారు. నల్గొండలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్  ఆయన మీడియాతో మాట్లాడారు.  వన్ టౌన్ ఎస్సై, సిబ్బంది నల్గొండ లోని మిర్యాలగూడ రోడ్డు లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా..  అనుమానాస్పదంగా వచ్చిన  హైదరాబాద్ కు చెందిన లింగ గళ్ళ పూర్ణచందు,  నల్గొండ కు చెందిన కానుకుంట్ల జగదీశ్​,  హరిజన్ మహేశ్​ను  విచారించారు. 

హైదరాబాద్ బాలానగర్ లో 2 కేజీల గంజాయిని  కొని,    దొంగిలించిన బైక్​పై   పట్టణానికి వచ్చినట్లు తెలిపారు.   వారి నుంచి  రూ 35 వేల విలువగల 1.6  కే‌‌‌‌జీల గంజాయి ,   బైక్​ను  స్వాధీనం చేసుకొని, వారిని కోర్ట్ లో హాజరు పరిచినట్లు తెలిపారు.