గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్కు యత్నం

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది. కొండాపూర్ మజీద్ బండలో స్కూల్ కు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్న ముగ్గురు చిన్నారులను.. గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో ఎక్కించాడు. ఆ తర్వాత మజీద్ బండ స్మశానవాటిక వైపు తీసుకెళ్తుండగా.. అనుమానంతో చిన్నారులు అరిచారు. 

దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ కిడ్నాపర్ ను పట్టుకున్నాడు. నిందితున్ని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. దీంతో ఆటో డ్రైవర్ ను చిన్నారుల కుటుంబ సభ్యులు అభినందించారు.