
గద్వాల, వెలుగు: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గోదామ్‌లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను బుధవారం సంబంధిత అధికారులు, పొలిటికల్ లీడర్లతో కలిసి తనిఖీ చేశారు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్, సురేశ్ పాల్గొన్నారు.
నేడు జాబ్ మేళా..
జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం తన ఛాంబర్ లో వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఉదయం 9:30 నుంచి ఎంఏఎల్డీ వర్చువల్ క్లాస్ రూమ్ లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.