గౌడన్నలు ఐక్యంగా ఉండాలి: మంత్రి పొన్నం

గౌడన్నలు ఐక్యంగా ఉండాలి: మంత్రి పొన్నం

ఖైరతాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా గౌడన్నలు ఐక్యంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని సంజీవయ్య పార్కులో గౌడ అఫీషియల్​అండ్​ ప్రొఫెషనల్స్​అసోసియేషన్​ఆధ్వర్యంలో  ఆదివారం కార్తీకమాస వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉండి గోపాను విస్తరించాలని, గౌడ సామాజికవర్గానికి చెందిన బిడ్డలంతా సభ్యులుగా చేరి ఇలాంటి వేదికల ద్వారా కలుస్తూ ఉండాలన్నారు. మాజీ మంత్రులు  శ్రీనివాస్​ గౌడ్, రాజేశం గౌడ్, మండలి మాజీ చైర్మన్​స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.