తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ )కు ఇప్పటికే సామాన్య జనం.. ప్రతిపక్షాల నుంచి మద్దతు వచ్చింది. లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి కూడా మద్దతు మద్దతిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రేవంత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మెగాబ్రదర్ నాగబాబు సీఎం రేవంత్ రెడ్డిన తన ఎక్స్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రశంసనీమన్నారు. వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే .. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. మనం దానికి హాని చేస్తే, అది ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని సమర్ధించారు. ప్రకృతిని గౌరవిద్దాం. విచ్ఛిన్నమైన వ్యవస్థపై నకిలీ మేకప్‌లు వేయకుండా..గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
ALSO READ | తెలంగాణపై ప్రకృతి దాడి చేసింది : సీఎం రేవంత్
మరో నటి మధుశాలిని సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. రేవంత్ రెడ్డి విజన్..నాయకత్వానికి ధన్యవాదాలు అని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.హైడ్రా అనేది మన సహజ పర్యావరణ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫార్వర్డ్-థింకింగ్ విధానాన్ని సూచిస్తుందని అన్నారు.
గ్రేటర్లో చెరువులు,కుంటలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే నగర వ్యాప్తంగా వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇటీవలే మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేసింది హైడ్రా.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 1, 2024
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…