జూబ్లీహిల్స్‌లోని టానిక్ లిక్కర్ మార్ట్ మూసివేత

జూబ్లీహిల్స్‌లోని టానిక్ లిక్కర్ మార్ట్ మూసివేత

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టానిక్ లిక్కర్ మార్ట్ ను ఎక్సైజ్ అధికారులు మూసివేశారు.  మార్ట్  లైసెన్స్ గడువు ముగియటంతో మార్ట్ ను  మూసేశారు.  టానిక్ లిక్కర్ మార్ట్  లైసెన్స్ పొడిగించేందుకు మార్ట్  నిర్వహకులు అర్జీ పెట్టుకున్నా  అధికారులు నిరాకరించారు.  

గత ప్రభుత్వం స్పెషల్ జీవోతో ఈ లిక్కర్ మార్ట్  కు  అనేక రాయితీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.  అంతేగాకుండా కోట్లాది రూపాయల పన్ను ఎగ్గొట్టినట్లు కమర్షియల్ ట్యాక్స్  అధికారులు గుర్తించారు.  ఈ మార్ట్ కు  రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా లిక్కర్ తీసుకునే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. 

టానిక్  లిక్కర్ మార్ట్  బీఆర్ఎస్ పెద్దలకు సంబంధించినది అయినందుకే అధికారులెవరూ పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. అన్ని వైన్స్​ల్లో మద్యం అమ్మకాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటే.. ఈ టానిక్ మార్ట్ కు  మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకూ పర్మిషన్ ఇచ్చారు.

ALSO READ | ‘సెలవులు రద్దు చేసుకోండి’.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు