నా నీళ్లు తాగొద్దు..సింహానికి తాబేలు వార్నింగ్

నా నీళ్లు తాగొద్దు..సింహానికి తాబేలు వార్నింగ్

సింహాన్ని ఆమడ దూరంలో చూస్తేనే.. భయంతో పారిపోతాం. ఎక్కడ దాడి చేస్తుందో అని  గజ గజ వణికిపోతాం. ఇక సాధారణ జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అడవికి రాజైన సింహం కంట పడితే  కథమే అనుకుంటాయి ఇతర జంతువులు. అందుకే సింహం కంటపడకుండా తప్పించుకుని తిరుగుతూ ప్రాణాలు కాపాడుకుంటాయి. కానీ ఓ తాబేలు మాత్రం..ఎలాంటి భయం లేకుండా..సింహాన్నే బెదిరించింది. 

అడవిలో ఓ సింహానికి విపరీతంగా దాహం వేసింది. నీటి కోసం వెతికుతూ ఉంటే  ఓ కుంట కనిపించింది. కుంటలో దిగిన సింహం..నీటిని తాగుతూ ఉంది. ఇంతలో  కుంటలోని నీళ్లలో నుంచి  ఓ బుజ్జి తాబేలు బయటకు వచ్చింది.  కుంట ఒడ్డున నీళ్లు తాగుతున్న సింహం దగ్గరకు చేరింది. తాబేలును చూసిన సింహం ఏమీ అనకుండా నీళ్లు తాగుతూ ఉంది. అయితే సింహం నీళ్లు తాగుతుండగా..తాబేలు అడ్డుకునే ప్రయత్నం చేసింది. సింహం నోటి దగ్గరకు వెళ్లి తాగొద్దని వారించింది. ఇవి నా నీళ్లు నువ్వు ఎందుకు తాగుతున్నావ్ అన్నట్లు అడ్డుపడింది. 

Also Read :- మెట్రోలో బీడీ తాగిన ప్రయాణికుడు.. అందరూ గుడ్లప్పగించి చూశారు.. !

సింహం నీళ్లు తాగుతుంటే..తాబేలు అడ్డుపడినట్లుగా ఉన్న 13 సెకన్ల వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో సింహం నీళ్లు తాగుతుండగా..మొదట తాబేలు అడ్డుపడే ప్రయత్నం చేసింది. తాబేలును చూసిన సింహం పక్కకు వెళ్లు అన్నట్లుగా తల ఊపింది. అయినా కూడా వినిపించుకోని తాబేలు..సింహం నోటి దగ్గరగా వచ్చింది. అయితే తనను అడ్డుకున్న తాబేలును సింహం ఏం చేయలేదు. దానిపై దాడి చేయకుండా నీళ్లు తాగి వెళ్లిపోవడం గమనార్హం.