మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి నేనే : చలమల్ల కృష్ణారెడ్డి

చౌటుప్పల్ వెలుగు:  మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం చౌటుప్పల్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ..  మునుగోడు సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తారని సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో  వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.  కొందరు సొంత పార్టీ నేతలే అపోహలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు.

తాను నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం  పడుతున్నారని, అదిచూసి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ ఓర్వడం లేదని విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఎన్నికల ముందు టెండర్లు పిలవకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వదిలేసిందని మండిపడ్డారు. మునుగోడులో సీపీఐ, సీపీఎం పార్టీల సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి , మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.