viral video : ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని బానెట్‌ పైనే.. 100 మీటర్లు లాకెళ్లిన కారు

viral video : ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని బానెట్‌ పైనే.. 100 మీటర్లు లాకెళ్లిన కారు

విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని కారుతో ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు కారు బానెట్ పైనే లాకెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ జంక్షన్ దగ్గర కారు స్లో చేయమని అడిగినందుకు కొందరు దుండగులు కానిస్టేబుల్ ని ఢీకొట్టి లాక్కెళ్లారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని వేగంగా వచ్చిన కారు బానెట్ పైకి ఎక్కించుకొని 100 మీటర్ల దూరం వరకూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మాధవ్ నగర్ జంక్షన్ లో కారు డ్రైవర్‌ని స్లో చేయమని చెప్తున్నా వినకుండా.. డ్యూటీలో ఉన్న బ్రిజేంద్ర సింగ్ ను కారు ఢీకొట్టారు. దీంతో కారు బానెట్ పై కానిస్టేబుల్ పడిపోయాడు. అయినా కూడా కారు ఆపకుండా దాదాపు 100 మీటర్ల దూరం అలాగే తీసుకెళ్లారు. ఆ తర్వాత హరిశంకర్ పురం జంక్షన్ లో డ్రైవర్ కారు సడెన్ గా టర్న్ చేయడంతో బ్రిజేంద్ర సింగ్ కారుపై నుంచి కిందపడి పడ్డాడు. తల నేలకు ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడు. వెంటనే కానిస్టేబుల్ ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. నిందితులపై ఝాన్సీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా గ్వాలియర్ ఎస్పీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.