- ఎంపీ సంజయ్ చొరవతో ప్రాజెక్టుకు మోక్షం
- రీసర్వే కోసం రూ.1.54 కోట్లు మంజూరు
- 62 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్
- త్వరలోనే భూసేకరణ
కరీంనగర్, వెలుగు: గ్రీన్సిగ్నల్ఇచ్చింది. 61.80 కిలోమీటర్ల రైల్వే లైన్ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.1.54 కోట్లు శాంక్షన్ చేసింది. భూసేకరణ, ట్రాక్, స్టేషన్ల నిర్మాణ పనులు చకచకా పూర్తయితే మరికొద్ది సంవత్సరాల్లోనే కరీంనగర్ నుంచి హనుమకొండ జిల్లాకు రైలు కూత పెట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏప్రిల్ 21న ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఈ లైన్నిర్మించాలని వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే మంత్రి యుద్ధప్రాతిపదికన కొత్త రైల్వే లైన్నిర్మాణంపై రీసర్వే చేసి రిపోర్ట్ సిద్ధం చేయాలని అదేరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్లను ఆదేశించారు. తాజాగా నిధులు కూడా మంజూరు కావడంతో పెండింగ్ ప్రాజెక్టుకు మోక్షం కలిగినట్లయింది.
పదేళ్లుగా ఎదురుచూపులు..
కరీంనగర్– హసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి 2013లోనే సర్వే చేసినప్పటికీ.. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ ఈ లైన్ నిర్మాణ ప్రస్తావన ఉంది. సుమారు 62 కిలోమీటర్ల మేర ఉండే ఈ లైన్పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్‌తోపాటు వరి,
మక్కలు, తదితర పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుంది. ప్రస్తుతం కాజీపేట జంక్షన్ నుంచి ముంబై వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా వయా నిజామాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఈ లైన్పూర్తయితే
కరీంనగర్ మీదుగా ముంబై వెళ్లొచ్చు. ఇప్పటికే కరీంనగర్– నిజామాబాద్ రైల్వే మార్గం పూర్తయింది. కొత్తపల్లి–- మనోహరాబాద్ ట్రాక్ పనులు స్పీడందుకున్నాయి. తాజాగా ఆమోదం పొందిన కరీంనగర్– హసన్‌పర్తి లైన్కూడా పూర్తయితే కరీంనగర్ వాసులకు రైలు సేవలు
మరింత చేరువకానున్నాయి.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్జిల్లాలకు ఎంతో ప్రయోజనం
ఈ రైల్వే లైన్‌నిర్మాణానికి 2013లోనే సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఈ లైన్ ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి వినతులు సమర్పించాం. ఈ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అడగగానే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
- బండి సంజయ్ కుమార్, బీజేపీ స్టేట్ చీఫ్