
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవానికి గురుకుల విద్యార్థులను చెత్త ట్రాక్టర్‌లో తరలించడం వివాదాస్పదమైంది. బుధవారం హుస్నాబాద్ ఎల్లమ్మచెరువు వద్ద ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగాలో శిక్షణ పొందిన ఎస్సీ గురుకుల స్టూడెంట్లకు మున్సిపల్ ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.