స్కూల్ పిల్లల కోసం సమ్మర్ క్యాంప్

స్కూల్ పిల్లల కోసం సమ్మర్ క్యాంప్
  • 28 నుంచి పలు అంశాలపై ట్రైబల్ డిపార్ట్​మెంట్ ట్రైనింగ్ 

హైదరాబాద్, వెలుగు: స్కూల్ పిల్లల కోసం ట్రైబల్ ఆర్ట్, క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ ఓ ప్రకటనలో తెలిపారు. మసాబ్ ట్యాంక్ వద్దనున్న ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టీఆర్ఐ)లోని నెహ్రూ సెంటెనరీ ట్రైబల్ మ్యూజియంలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 7 వరకు 3వ తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్స్ కు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 

ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 60 మంది విద్యార్థులకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 వరకు మరో 60 మంది స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తామని వివరించారు. ఈ సమ్మర్ క్యాంప్​లో   కోయ పెయింటింగ్, బంజారా క్రాఫ్ట్, నగల తయారీ, నాయక్​పోడ్ మాస్క్​లు, కొలాం వెదురు వంటి చేతి పనులపై ట్రైనింగ్ ఇస్తామన్నారు.