ఆశ్రమ పాఠశాల తనిఖీ

ఆశ్రమ పాఠశాల తనిఖీ

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ జూకల్ శివారులోని ఆశ్రమ పాఠశాలను గిరిజన అభివృద్ధి శాఖ అధికారి అఖిలేశ్​రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. 

స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ గా అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలని, జీవితంలో మంచి లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించాలన్నారు. అనంతరం స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు..