
నేరడిగొండ, వెలుగు: ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే పోటీల్లో నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే పోటీల్లో స్కూల్ విద్యార్థులు పల్లవి, అంజన, కీర్తన గోల్డ్ మెడల్ సాధించారు.
దుర్గ, నందిత, ప్రీతి, వైష్ణవి, నిఖిత, శృతి సిల్వర్ మెడల్, అక్షర, నందిని, సాయి ప్రియ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. పథకాలు సాధించిన విద్యార్థు లను రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి, టీచర్లు అభినందించారు.