ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
పిట్లం, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. బుధవారం పెద్దకొడప్‌గల్ రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 435 మందికి ఆసరా పెన్షన్లు, 50 మంది రైతులకు సొసైటీ ద్వారా రూ. 22.50 లక్షల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చిందన్నారు. కల్యాణలక్ష్మి వంటి పథకం
దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీవో రాణి, సర్పంచ్ తిరుమల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ విజయ్ దేశాయి, సొసైటీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, అంబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీవన శైలిని మార్చుకోవాలి
నిజామాబాద్, వెలుగు: మన జీవన శైలితో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే అధిక రక్తపోటు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ప్రముఖ డాక్టర్ డి.వినయ్ చెప్పారు. ఈనెల 29న వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని బుధవారం ఇందూరులోని సన్ రైజ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దవారితో పాటు 18 ఏళ్లు, చిన్న వయస్సు ఉన్న వారు బీపీతో బాధపడుతున్నారన్నారు. హార్మోన్ల సమస్య, తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం పాటు కూర్చోవడం తదితర కారణాల వల్ల చిన్న పిల్లలకు బీపీ వస్తోందన్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు పౌష్టికా హారం తినడంతో పాటు ఫ్రైలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినవద్దని తెలిపారు. ప్రతిరోజు కనీసం అరగంట సేపు వాకింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవర్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ కెంచి గోపికృష్ణ హాస్పిటల్, అడ్మినిస్ట్రేటర్ శివ చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
అక్రమార్కులపై చర్య తీసుకోవాలి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన భూ దందాలపై కలెక్టర్ స్పందించాలని, ధరణిలో ఏర్పడిన రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి నేతృత్వంలో లీడర్లు, కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూల్స్‌కు విరుద్ధంగా స్కీమ్‌లతో ప్టాట్ల అమ్మకాలు, అసైన్డ్ భూములకు ఎన్‌వోసీల జారీ, భూ అక్రమణలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వీటిపై ఏ మాత్రం ఎంక్వైరీ చేయడం లేదన్నారు. ధరణి వల్ల ఏర్పడిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకునే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ భరత్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ విపుల్, కౌన్సిలర్లు రవి, సుజిత, నరేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజీని సందర్శించిన న్యాక్ టీమ్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని బుధవారం న్యాక్ టీమ్ సందర్శించింది. పీర్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ మనోజ్ధార్, కోఆర్డినేటర్ శివపుత్ర పథగుండి, మెంబర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ బృందం కాలేజీని పరిశీలన చేసింది. కాలేజీకి సంబంధించి వివరాలను పవర్ పాయింట్ ద్వారా ప్రిన్సిపాల్ కిష్టయ్య టీమ్‌కు వివరించారు. స్టూడెంట్లతో పాటు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో కూడా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు.
విండో అభివృద్ధికి సహకరించాలి
లింగంపేట, వెలుగు: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సకాలంలో చెల్లించి సింగిల్‌విండో అభివృద్ధికి సహకరించాలని లింగంపేట సొసైటీ చైర్మన్ కూచన్‌పల్లి దేవేందర్‌రెడ్డి కోరారు. బుధవారం సొసైటీ గోదాంలో మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రైతులనుద్దేశించి మాట్లాడుతూ విండో పరిధిలోని 231 మంది రైతులు రూ.13 కోట్ల బకాయి పడ్డారని, వీరంతా చెల్లిస్తే మరి కొంత మంది రైతులకు రుణాలు అందిస్తామని చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మిషన్‌పై జల్లెడ పట్టిన తర్వాతనే కొనుగోలు చేస్తామన్నారు. సమావేశంలో విండో సీఈవో సందీప్, వైస్‌చైర్మన్ మాకం రాములు, డైరెక్టర్లు బోయిని సాయిలు, సాయాగౌడ్, రామలింగం, సిద్దిరాములు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బోధన్, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు ఐఎఫ్టీయూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రతినిధి పుట్ట వరదయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులు 12 రోజులుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంత శోచనీయమన్నారను. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సింగరేణి కాంట్రాక్ట్కార్మికులకు పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అనంతరం ఆర్డీవో ఏవోకు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు సురేశ్, సాయగౌడ్, రాజ్‌కుమార్, లక్ష్మణ్‌గౌడ్, నారాయణ, పేట సాయిలు, మల్లెపూల శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
కామారెడ్డి, వెలుగు: స్టేట్‌లో అధికారంలో ఉన్నది రైతు సంక్షేమ ప్రభుత్వమని విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో కామారెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో గంప గోవర్ధన్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కేంద్రంలో ఉన్నది రైతాంగ వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కామారెడ్డి చైర్మన్‌గా పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్‌గా కుంబాల రవి, భిక్కనూరు చైర్మన్‌గా భగవంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా హన్మంతురెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్డూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, లీడర్లు నిట్టు వేణుగోపాల్‌రావు, మామిండ్ల అంజయ్య, పిప్పిరి అంజనేయుడు, గోపిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పన్నులను ఇన్‌టైంలో వసూలు చేయాలి
బాల్కొండ, వెలుగు: సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేసి గ్రామంలో పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గోవింద్ నాయక్ సూచించారు. బుధవారం ఆయన మండలంలోని బస్వాపూర్ పంచాయతీ సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ క్యాష్ బుక్‌లు, రికార్డులను తనిఖీ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్, సర్పంచ్ కళ్యాణి గంగయ్య, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీవో ఇందిరా, పంచాయితీ పాలకవర్గం పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి
బోధన్, వెలుగు: ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని రైతు బంధు మాజీ అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్ చెప్పారు. బోధన్ మండల పరిషత్ ఆఫీసు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. హాస్పిటళ్ల డెవలప్‌మెంట్‌కు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే షకీల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలతో అనునిత్యం మమేకమై ముందుకు సాగుతున్నారని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శిర్ప సుదర్శన్, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ సాలూర షకీల్, హున్సా ఎంపీటీసీ శివకుమార్, సర్పంచ్‌లు వీరన్న పటేల్, అశోక్‌పటేల్, నాయకులు శ్యామ్‌రావు, వెంకటేశ్, ప్రవీణ్, రాజు, లక్ష్మణ్, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో హాస్పిటళ్ల తనిఖీ
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌లోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెండ్ నాగరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు చెప్పారు. డెలివరీ విషయంలో సిజేరియన్ ఎందుకు ఎక్కువగా చేస్తున్నారన్న విషయంపై రిపోర్ట్‌లను పరిశీలించామని, నివేదకను కలెక్టర్‌కు ఆందజేస్తామని తెలిపారు.