వరంగల్: టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 15వ తేదీన తలపెట్టిన 'తెలంగాణ విజయ గర్జన' సభను వాయిదా వేసింది. ఈ నెల 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. విజయ గర్జన సభ నిర్వహణ కోసం సోమవారం వరంగల్‌లో భేటీ అయిన టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.