- ఏడు రాష్ట్రాల్లో సర్వే.. ఐదింటిలో ఆధిక్యం
- బైడెన్ పనితీరుపై ఓటర్ల అసంతృప్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒపీనయన్ పోల్ సర్వేల్లో ముందంజలో నిలిచారు. మొత్తం ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా.. ఐదింటిలో ట్రంప్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉండగా.. జో బైడెన్ మాత్రం ఒక స్టేట్‌లోనే ఆధిక్యంలో ఉన్నట్టు తేలింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించిన వాళ్లకే అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉంటుంది. ఈ ఏడు స్టేట్స్లో వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ పోల్స్, మరికొన్ని సంస్థలు సర్వేలు చేపట్టాయి. దీంతో పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినాలో ట్రంప్ స్వల్ప మెజారిటీతో ముందంజలో నిలిచారు. జో బైడెన్ కేవలం విస్కాన్సిన్ స్టేట్‌లోనే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు.