
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం నుంచి తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ తెలిపారు.
కాగా, గత నెల 25 నుంచే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. స్థానికత అంశంపై స్పష్టత రాకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా, 15శాతం సీట్లను ఇతర ప్రాంతాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించడంతో అప్లికేషన్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. కాగా, ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఈ సారి కర్నూల్, విజయవాడ సెంటర్లను ఎత్తివేసినట్టు అధికారులు తెలిపారు.